ఐస్‌లో చేరబోతున్నారన్న ఆరోపణలతో నాగ్‌పూర్ విమానశ్రయంలో ముగ్గురి హైదరబాదీయుల అరెస్టు
నాగపూర్,డిసెంబర్26(జనంసాక్షి): ఐఎస్ తీవ్రవాద ఉచ్చులో చిక్కుకున్నముగ్గురిని ఎటిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతకొంతకాలంగా వీరిపైనిఘా పెంచిన అధికారులు శనివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రయంలో ఏటీఎస్ అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్నారన్న అనుమానంతో ముగ్గురిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ముగ్గురిని నాగ్‌పూర్ ఏటీఎస్ అధికారులు విచారిస్తున్నారు. తెలంగాణ,మహారాష్‌టర పోలీసులు ఉమ్మడిగా ఈ అపరేషన్ నిర్వహించారు. దీంతో హైదరాబాద్‌లో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల ఉనికి కలకలం రేపుతోంది. ఐఎస్‌ఐస్‌లో చేరేందుకు వెళ్తున్నట్లు అనుమానిస్తున్న ముగ్గురు అనుమానితులను శనివారం ఉదయం నాగపూర్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు యువకులు హైదరాబాద్‌కు చెందినవారు. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వీరు రోడ్డుమార్గం ద్వారా నాగపూర్ చేరుకొని అక్కడి నుండి ఇండిగో విమానంలో జమ్ముకశ్మీర్ వెళ్లడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అక్కడి నుండి ఆప్ఘనిస్తాన్ .. అనంతరం సిరియా వెళ్లి ఐఎస్‌ఐఎస్‌లో చేరడానికి ప్లాన్ చేసుకున్నట్లు నిఘా వర్గాలు పక్కా సమాచారం సేకరించాయి. తెలంగాణ, మహారాష్ట్ర పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురి కార్యకలాపాలపై నిఘా ఉంచిన తెలంగాణ పోలీసులు పక్కా సమాచారం ప్రకారం మహారాష్ట్ర పోలీసుల సహాయంతో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అదుపులోకి తీసుకున్న వారిలో ఇద్దరు ఇంతకు ముందు ఆప్ఘనిస్తాన్‌కు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు ఐఎస్ ఉగ్రవాదుల కార్యకలాపాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఐఎస్ ఉగ్రవాదుల పన్నిన వలలో అటు పెద్దల నుంచి మైనర్లు కూడా ఆకర్షితులవ్వడం ఆందోళన రేకెత్తిస్తోంది. గతంలోనూ హైదరాబాదీకి చెందిన ఓ యువతి ఐఎస్ లో చేరేందుకు యత్నించిన విషయం తెలిసిందే. తెలంగాణ పోలీసుల సమాచారం మేరకు శ్రీనగర్ వెళ్లేందుకు నాగ్ పూర్ విమానాశ్రయంలో ఉండగా మహారాష్ట్ర ఎటిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో అబ్దుల్ వాసిమ్, ఒమర్ ఫరూఖ్, హసన్ పరూఖ్ ఉన్నారు.సమాచార నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నాగపూర్ ఎయిర్‌పోర్టులో ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు.