ఒబామా కేబినెట్‌లోకి తొలి భారతీయుడికి చోటు !
అమెరికా, నవంబర్ 14 , మెరికా కొత్త మంత్రివర్గంలోని తొలిసారి ఓ భారతీయుడికి చోటు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా అంతర్జాతీయాభివృద్ధి సంస్థ (యుఎస్ ఎయిడ్స్) అధినేతగా పనిచేస్తున్న 39 ఏళ్ల రాజ్‌షాకు ఒబామా కేబినెట్‌లో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. రాజ్ షా తల్లిదండ్రులు 1960లలో భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చి మిచిగాన్‌లో స్థిరపడ్డారు. యూఎస్ ఎయిడ్ అధినేతగా తన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడంతో పాటు ఒబామాకు అత్యంత విశ్వసనీయుడిగా గుర్తింపు పొందారు. ఈయనకు ఒబామా కేబినెట్‌లో చోటు లభించవచ్చని, ముఖ్యంగా ఆరోగ్య, మానవ వనరులు, వ్యవసాయ శాఖ, విద్యాశాఖలలో ఒకదానికి ఆయనను మంత్రిగా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.