ఒబామా, రోమ్నీ మాటల తూటాల యుద్ధం

ఆకట్టుకున్న మొదటి  గ్రేట్‌ డిబెట్‌

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, రానున్న ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న  రోమ్మీల మధ్య తొలి ముఖాముఖి కార్యక్రమం బుధవారం ఆసక్తికరంగా సాగింది. అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన తొలి డిబేట్‌ నువ్వా నేనా అన్నట్లు సాగింది. తానే మెరుగైన అభ్యర్థినని చాటేందుకు, ఓటర్ల మైండ్‌ సెట్లను మార్చేందుకు ఇద్దరు కూడా మాటల తూటాలు పేల్చుకున్నారు. డొమెస్టిక్‌ పాలసీపైనే ప్రధానంగా ఈ డిబేట్‌ సాగింది. ఆర్థిక రంగం, ఉపాధి అవకాశాలపై ప్రశ్నల వర్షం కురిసింది. ఒబామా తన పాలనలో అమలు చేసిన విధానాలను సమర్థించుకుంటే, రోమ్మీ అందులోని లోపాలను ఎత్తి చూపారు. కొలరాడోలోని డెన్వర్‌లో ప్రథమ సమరం వాడి వేడిగా సాగింది. వచ్చే నెల 6న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వరుసగా మూడు వారాలు ఈ డిబేట్‌లు జరుగుతాయి. దీంతో ప్రపంచ దృష్టంతా ప్రస్తుతం ఈ డిబేట్‌ పైనే ఉంది.