ఒమిక్రాన్ బెల్స్ మోగుతున్నాయి జాగ్రత్త !
కరోనా ప్రపంచ వ్యాప్తంగా చేసిన మృత్యు కేళి మరువక ముందే ఒమిక్రాన్ రూపంలో మరో వేరింయట్‌తో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ కొత్త వేరింయట్ వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. తాజాగా బ్రిటన్‌లో మునుపెన్నడు లేని విధంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మనమంతా మళ్లీ తగిన జగ్రత్తలు తీసుకోకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు వస్తున్నాయి. ఒమిక్రాన్‌కు వేగంగా వ్యాపించే గుణం ఉందన్న కారణం గా మరింత జాగరూకత అవసరం. ఒమిక్రాన్‌తో భయంల లేదని, అది డేంజర్ కాదన్న వార్తలను కూడా నమ్మడానికి లేదు. అది ఆరకుండా చూసుకోవడమే పనిగా ప్రజలకు ఎవరికి వారు ముందుకు సాగాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌లు పెట్టి ప్రజలను కంట్రోల్ చేయదని గుర్తించాలి. ఆస్పత్రుల్లో చేరితో అస్సలు పట్టించుకోరు. ప్రైవేట్ దవాఖానాలకు పోయి లక్షలకు లక్షలు పెట్టి ప్రాణాలు పోగుట్టు కుందామా.. లేక జాగ్రత్తలు పాటిద్దామా అన్నది ఆలోచన చేయాలి. ఇకపోతే గతంలో డెల్టా వేరియంట్ విజృంభించి నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వ్యూహంపై విమర్శలు వచ్చాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా వ్యవహరించలేదన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఒమిక్రాన్ కారణంగా విమానాశ్రయాల్లో కేవలం రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఎక్కువగా దృష్టి పెట్టి పరీక్షలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో నమోదైన మూడు ఒమిక్రాన్ కేసులూ నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవే కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎపిలో కూడా ఒక కేసు నమోదయ్యింది. దీంతో ఒమిక్రాన్ ఇక వ్యాప్తించెందడానికి ఎంతో దూరం లేదని గుర్తించాలి. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రయాణికుల విషయంలో తీసుకోవల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది. రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ నిర్దారణ పరీక్షలు చేయాలని, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్‌గా పరీక్షలు చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల ఒకటో తేదీ నుంచి ఆ మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి. 11 దేశాలను రిస్క్ కేటగిరీ కింద గుర్తించారు. ఇందులో జర్మనీ, ఫ్రాన్స్, కెనడాతో పాటు యూఎస్, యూకే తదితర దేశాలున్నాయి. ఆయా దేశాల నుంచి వచ్చిన అందరు ప్రయాణికులకు, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ర్యాండమ్‌గా శంషాబాద్ విమానా శ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిస్క్ దేశాల నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలిన వారి నమూనాల్లో ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్ స్వీక్వెన్సింగ్‌కు పంపిస్తున్నారు. ఈ క్రమంలో బయటపడ్డ కేసులు కావచ్చు..బయటపడని కేసులు కావచ్చు.. ఒకటి రెండు కేసులయినా వ్యాప్తి చెందడానికి ఎంతో సమయం పట్టదు. డెల్టా వేరియంట్ వ్యాప్తిని చూస్తే ఇది అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించక ముందే కరోనా అని నిర్దారణ కాగానే వారిని విమానాశ్రయం నుంచి నేరుగా టిమ్స్‌కు తరలిస్తు న్నారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారి నుంచి కేవలం నమూనాలు సేకరించి ఆర్టీపీసీఆర్ ఫలితం రాకముందే పంపేస్తున్నారు. ఇలా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 7,018 మందికి కోవిడ్`19 నిర్దారణ పరీక్షలు చేశారు. వీరిలో నాన్ రిస్క్ దేశాలకు చెందిన వారు 1,622 మంది ఉన్నారు. ఈ విధంగా నిర్దేశిరచిన 2 శాతం కంటే ఎక్కువగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరీక్షలు చేసింది. ఈ క్రమంలోనే తొలిసారిగా 3 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇదే సమయంలో తెలుగు రాష్టాల్ల్రో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రిస్క్, నాన్ రిస్క్ దేశాలనే దానితో సంబంధం లేకుండా విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడిపైనా దృష్టిపెట్టి పరీక్షలు చేయాలనే
అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా నమోదైన మూడు కేసులు జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశాల నుంచి వచ్చే బంధువులను కూడా అనుమానించేల్సిందే. అలాగే ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తున్న వారిని ఆర్టీపీసీఆర్ ఫలితం వచ్చేవరకు ఆపకుండా పంపించేయడం కూడా సమంజసం కాదని పేర్కొంటున్నారు. ఇలా పంపించేయడం వైరస్ వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో బయట పడిన 3 కేసులు ఇందుకు నిదర్శనమని అంటున్నారు. మన దేశంలోని సగం మందిని ఇప్పటికే డెల్టా ప్రభావితం చేయడం, ఆ తర్వాత వాళ్లు టీకాలు తీసుకోవడం వల్ల కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే శక్తి చాలావరకు వస్తుందని అంటున్నారు. ఒకరి నుంచి కుటుంబంలోని ఇతర సభ్యులకు వేగంగా సోకే లక్షణాలున్నాయి. వ్యాక్సిన్ నుంచి తప్పించుకునే లక్షణాల కారణంగా ఎక్కువ మందికి సోకుతుంది. అందు వల్ల మూడు, నాలుగు నెలల్లో ఇక్కడ థర్డ్‌వేవ్ రావొచ్చు. టీకాలతో మరణాలు సంభవించకుండా ఆపొచ్చే తప్ప వైరస్ సోకకుండా పూర్తిస్థాయిలో నియంత్రించలేము. ఇన్ఫెక్షన్ తర్వాత తీసుకునే వ్యాక్సిన్ శక్తివంత మైనదని కూడా డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. సాధారణ ప్రజలు డెల్టా ఎఫెక్ట్ అయ్యాక టీకా తీసుకుంటే, వైద్యులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లు వ్యాక్సిన్ తీసుకున్నాక వైరస్ బారిన పడ్డారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే సమర్థత వస్తుంది. దీనినే హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటారు. ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలో ఈ ఇమ్యూనిటీ ఎక్కువే.. అరవై ఏళ్లకు పైబడినవారు టీకాలు వేసుకుని 6 నెలలు గడిచి నందున వారు ప్రభావితం కావొచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యసమస్యలున్న వారిపైనా దీని తీవ్రత ఎక్కువుండే అవకాశాలున్నాయి. కాబట్టి మనమంతా ఇప్పుడు ఒమిక్రాన్ కావచ్చు..మరేదైనా వేరియంట్ కావచ్చు…మన జాగ్రత్తలే ముఖ్యం. అందుకు ప్రజలు ఎవరికి వారు సన్నద్దం కావాలి.