ఓటరు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
వరంగల్, జనవరి 20 (: జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 24, 25 తేదీలో నిర్వహించనున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని తహశీల్దార్ రాములయ్య సూచించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ భవనంలో వైద్య, ఐసిడిఎస్, అంగన్‌వాడీ, బీఎల్‌వోలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న మండలంలోని అన్ని గ్రామాల్లో ర్యాలీలు, 25న మండల కేంద్రంలో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన యువకులందరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలన్నారు. యువత ఓటరు నమోదులో నిర్లక్ష్యం వహించ వద్దన్నారు. దేశ భవిష్యత్ వారి చేతుల్లోనే ఉందన్నారు. సమావేశంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు జ్యోతి, సుధ తదితరులు పాల్గొన్నారు.