ఓటుకు నోటు కేసులో డి.కె.శ్రీనివాస్‌ను ప్రశ్నించిన ఏసీబీ

5

హైదరాబాద్‌,ఆగస్ట్‌ 18 (జనంసాక్షి):

ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. తెలంగాణ ఏసీబీ విచారణల పర్వం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ ఆదికేశవులనాయుడు కుమారుడు డీకే.శ్రీవివాస్‌తోపాటు ఆయన కార్యాలయ కార్యదర్శి విష్ణుచైతన్యకు ఏసీబీ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. న సంగతి తెలిసిందే . ఈ మేరకు మంగళవారం టీ. ఏసీబీ ఎదుట డీకే. శ్రీనివాస్‌తో పాటు ఆయన కార్యాలయ కార్యదర్శి విష్ణుచైతన్య విచారణకు హాజరయ్యారు. ఇక ఇప్పటికే ఈ కేసులో నోటీసులు అందుకున్న చంద్రబాబు తనయుడు లోకేష్‌ డ్రైవర్‌ కొండల్‌రెడ్డి, జిమ్మిబాబు ఇప్పటికీ విచారణకు రాలేదు. శ్రీనివాస్‌ నాయుడుకు 160 సీఆర్‌పీసీ సెక్షన్‌ కింద ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శ్రీనివాస్‌ నాయుడితో పాటు విష్ణు చైతన్య అనే వ్యక్తి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏసీబీ అధికారులు వీరిద్దరిని విచారిస్తున్నారు. తెలంగాణ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీవెన్సన్‌ కు టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఇచ్చిన డబ్బు ఏభై లక్షల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చిందన్నదానిపై కూపీ లాగుతున్న ఎసిబి , ఆ క్రమంలో శ్రీనివాస నాయుడును విచారిస్తోంది.రేవంత్‌ కు శ్రీనివాసనాయుడుకు దగ్గర సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. శ్రీనివాస నాయుడు స్విట్జర్లాండ్‌ లో ఉన్నారని కొందరు ప్రచారం చేసినా, అది అవాస్తవమని తేలింది.