ఓట్లు, సీట్లే లక్ష్యంగా తెరాస ముందుకెళ్తోంది: మంత్రి

శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌ : ఓట్లు, సీట్లే లక్ష్యంగా తెరాస ముందుకెళ్తోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సంఖ్యాబలం పెంచుకుని ప్రత్యేక రాష్ట్రం ఎలా సాధిస్తారో తెరాస నేతలు చెప్పాలని ఆయన అన్నారు. అజాద్‌ వ్యాఖ్యల్ని తప్పుబడుతున్న కేసీఆర్‌ గతంలో ఎన్నిసార్లు డెడ్‌లైన్లు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకొంటున్న తెరాసలో ఉద్యమకారులకు గుర్తింపు కనబడట్లేదని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ సమస్య పరిష్కారమయ్యాకే ఎన్నికలకు వెళ్తామన్న నమ్మకముందని మంత్రి అన్నారు.