ఓబిసి రిజర్వేషన్ల బిల్లుకు విపక్షాల మద్దతు


సభ ముందుకు 172వ రాజ్యాంగ సవరణ బిల్లు
బిల్లును ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన సభ్యులు
న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనంసాక్షి): రెండు వారాల నుంచి వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు వరుసగా వాయిదాపడుతున్న క్రమంలో వెనుకబడిన తరగతులకు ఒబిసి రిజర్వేషన్ల విషయంలో విపక్షాలు కేంద్రానికి సహకరించి చర్చకు వచ్చాయి. ఆయా రాష్టాల్రకు హక్కు కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో 172వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు అంతకుముందే మద్దతు ప్రకటించడంతో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆందోళన చేయకుండా చర్చలో పాల్గొన్నాయి. నిజానికి పెగాసస్‌ వ్యవహారం, నూతన సాగు చట్టాల రద్దు అంశంలో రెండు వారాల నుంచి పార్లమెంట్‌లో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. మంగళవారం కూడా విపక్షాలు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాన్ని వెల్లడిరచాయి. ఈ నేపథ్యంలో మల్లిఖార్జున్‌ ఖర్గే నేతృత్వంలో జరిగిన సమావేశంలో పలువురు నేతలు పాల్గొని బిల్లుకు మద్దతు ప్రకటించారు. ఒబిసి బిల్లుకు మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురీ వెల్లడిరచారు. టిఆర్‌ఎస్‌ ఎంపి బిబి పాటిల్‌, బిజూ జనతాదళ్‌ ఎంపి రమేశ్‌ చంద్ర, లోక్‌ జనశక్తి పార్టీ ఎంపి ప్రిన్స్‌ రాజ్‌, జెడి(యు) ఎంపి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌లు బిల్లును ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లలో రిజర్వేషన్ల సమస్యను పరిష్కరిస్తుందని ప్రిన్స్‌ రాజ్‌ అన్నారు. కాగా, శివసేన ఎంపి వినాయక్‌ రౌత్‌.. మరాఠాల రిజర్వేషన్లపై మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన తర్వాతే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు. కులాల వారీగా జనగణన చేపట్టాల్సిందిగా వైసిపి ఎంపి బి.చంద్రశేఖర్‌ కేంద్రాన్ని కోరారు. బిల్లుకు మద్దతు తెలిపిన తృణమూల్‌ పార్టీ ఎంపి సుదీప్‌ బంధోపాధ్యాయ పెగాసస్‌ విూద కూడా చర్చకు ఒప్పుకొంటే.. ఇప్పుడు జరుగుతున్నట్టే సమావేశాలు సాఫీగా సాగుతాయని అన్నారు. 30 బిల్లులను కేవలం 10 నిమిషాల్లోనే ఎలా పాస్‌ చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేవలం 11 శాతం బిల్లులనే కమిటీలు పరిశీలించాయన్నారు. ఒబిసిల రిజర్వేషన్ల కోసం డిఎంకె పోరాడిరదని ఆ పార్టీ ఎంపి టిఆర్‌ బాలు పేర్కొన్నారు. కాగా, పెగాసస్‌, రైతు చట్టాల రద్దు వంటి అంశాలపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలు మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత లోక్‌సభలో చర్చ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళన చేయడంతో రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, పార్లమెంట్‌లో పలు బిల్లులు ఆమోదించే సమయంలో పలువురు బిజెపి ఎంపిలు గైర్హాజరయ్యారు. దీంతో ప్రధాని మోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన రాజ్యసభ సమావేశాలకూ కొందరు బిజెపి ఎంపిలు హాజరు కాలేదు. దీని గురించి ఈ రోజు జరిగిన పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని ప్రశ్నించారు. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజ్యసభలో పలు కీలక బిల్లుల్ని ఆమోదించనున్న నేపథ్యంలో పార్టీ సభ్యులంతా మంగళ, బుధవారాల్లో
తప్పక హాజరు కావాలని సోమవారం బిజెపి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో చేసిన తప్పులను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సరిదిద్దుకుందని కాంగ్రెస్‌ లోక్‌ సభా ప్రతిపక్షనేత అధీర్‌ రంజన్‌ చౌదరి అన్నారు. ఈ బిల్లు చాలా కీలకమైనది కాబట్టే చర్చలో పాల్గొంటున్నామని చెప్పారు. పంచాయతీ రాజ్‌ చట్టాన్ని అమలు చేయడంలో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. మరాఠా రిజర్వేషన్లపైనా కేంద్రం దష్టి పెట్టాలని ఆయన కోరారు.