ఓమగ పసికందును తుమ్మపొదల్లో వదిలిన గుర్తు తెలియని వ్యక్తులు

ఓదెల: మండలంలోని చిన్నకొమిరెలో సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఓ మగ పసికందును గోనె సంచిలో చుట్టి గ్రామ శివారులోని తుమ్మ పొదల్లో వదిలి వెళ్లారు. ఆ చిన్నారి అరుపులు విన్న సమీపంలోని మహిళలు పసికందును గమనించి చేరదీశారు. ఆ పసికందు ఈ రోజే జన్మించి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో చిన్నారిని వదిలి వెళ్లినవారు ఎవరనే విషయంపై వారు విచారణ చేపట్టారు.