ఓయూ డిగ్రీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి):  ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. డిగ్రీ ఫలితాలను విడుదల చేసినట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షల్లో 48.58 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని స్పష్టం చేశారు. పరీక్షకు 65,216 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 31,683 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వివరించారు. అభ్యర్థులు తమ ఫలితాలను వర్సీటీ అధికారికి వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చని వారు వెల్లడిరచారు.