ఓవర్‌కు 18 బంతులు వేశాడు


ఇంగ్లాండ్‌ డొమెస్టిక్‌ క్రికెట్‌లో వింత ఘటన
నవ్వులు పుయించే నాటి ఘటన
న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ అయినా.. సాధారణ ఆటగాడైనా కూడా ఎప్పుడొకప్పుడు ఫామ్‌ కోల్పోవాల్సిందే. మళ్లీ తిరిగి ఫామ్‌ను పొందేందుకు ఎంతగానో కష్టపడతారు. చక్కటి లైన్‌ అండ్‌ లెంగ్త్‌ వేసేందుకు బౌలర్లు తెగ ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు ఈ కారణంగా ప్రత్యర్ధి జట్టుకు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటారు. వేగాన్ని, లైన్‌ అండ్‌ లెంగ్త్‌ అందుకునేందుకు ఓ బౌలర్‌ ఇలాగే కష్టపడ్డాడు. దీనితో ఓవర్‌కు 6 బంతులు వేయాల్సింది 18 బంతులు వేశాడు. ఈ ఘటన ఇంగ్లాండ్‌ డొమెస్టిక్‌ క్రికెట్‌లో చోటు చేసుకుంది. మిడిల్‌సెక్స్‌, వార్‌విక్‌షైర్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గ్లాడ్‌స్టోన్‌ స్మాల్‌ అనే బౌలర్‌ ఆరు కాదు, పన్నెండు కాదు ఏకంగా ఓవర్‌కు 18 బంతులు వేశాడు. అతడు వేసిన ఓవర్‌లో నో-బాల్స్‌ ఎక్కువ ఉన్నాయి. సుమారు 39 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్‌లోని రెండు కౌంటీ జట్లైన మిడిల్‌సెక్స్‌, వార్విక్‌షైర్‌ మధ్య ఈ మ్యాచ్‌ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్‌ చేసిన మిడిల్‌సెక్స్‌ 8 వికెట్లకు 360 పరుగులు చేసింది.
వార్‌విక్‌షైర్‌ బౌలర్‌ గ్లాడ్‌స్టోన్‌ స్మాల్‌ తన మొదటి ఓవర్‌లో 11 నో-బాల్స్‌ వేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 19 ఓవర్లు బౌలింగ్‌ చేసిన స్మాల్‌ 64 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే గ్లాడ్‌స్టోన్‌ స్మాల్‌ 17 టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో మిడిల్‌సెక్స్‌ 360 పరుగులకు డిక్లేర్‌ ఇవ్వగా.. వార్విక్‌షైర్‌ జట్టు 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా, ఫాలో-ఆన్‌ ఆడాల్సి వచ్చింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లోనూ వార్విక్‌షైర్‌ జట్టు విఫలం కాగా ఇన్నింగ్స్‌, 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.