ఓవర్‌లోడ్‌ను అడ్డుకుంటాం

కరీంనగర్‌ క్రైం, జనంసాక్షి : నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్న లారీలను అడ్డుకుంటామని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు ఎంఏ సాజిద్‌, నర్సింహారెడ్డి, ఖలీలుద్దీన్‌లు హెచ్చరించారు. లారీలు పరిమితికి మించి సరుకు రవాణా చేయడాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసినా కొందరు యజమానులు పాటించడం లేదని విమర్శించారు. గతనెల నుంచి ఓవర్‌లోడ్‌ వాహనాల పై కేసులు నమోదు చేస్తామని అధికారులు ప్రకటించినా స్పందన లేదని, దీంతో కొందరు పరిమితికి మించి ధాన్యం రవాణా చేస్తున్నారనీ ప్రతీనిదులు కలెక్టర్‌,పౌర సరఫరాల అధికారి రవాణాధికారికి సోమవారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈనెల 2న అధికారులు ఉత్తర్వుల మేరకు అధిక లోడ్‌తో వెళ్లే లారీలకు కిరాయిల చెల్లించబోమని అధికారులు హమీ ఇచ్చినట్లు వారు చెప్పారు.