ఓవైసీ వ్యాఖ్యలకు నిరసనగా

– న్యాయవాదులు విధులు బహిష్కరణ
నిజామాబాద్‌, జనవరి 4 (): ఎంఎఐఎ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖలకు నిరసనగా శుక్రవారం నాడు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. భారతదేశ లౌకిక వాదాన్ని, రాజ్యాంగ చట్టాలను ప్రశ్నిస్తూ, మతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా అక్బరుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లింబాగౌడ్‌, కార్యదర్శి భాస్కర్‌లు విమర్శించారు. శుక్రవారం బార్‌ అసోసియేషన్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఓవైసీ వ్యాఖ్యలు ఖండించారు. ఓవైసీకి ఏ న్యాయవాది కూడా సహకరించవద్దని సూచించారు. తక్షణమే ఓవైసీ దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఓవైసీని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.