ఓ కుటుంబంలో సంతోషాన్ని నింపిన వాట్సాప్ గ్రూప్ ఎలాగో ?

గంగారం సెప్టెంబర్ 18 (జనం సాక్షి)
ఇంచుమించుగా మన చుట్టూ వున్న 99% మందికి తమ స్మార్ట్ ఫోన్ లలో వాట్సాప్ అనేది ఉంటుంది.అందులో అనేకమంది ఏదో ఒక వాట్సాప్ గ్రూప్ లలో సభ్యులు అయి వుంటారు.అయితే అలాంటి గ్రూపులతో ఎక్కువగా స్కాం మెసేజులే సర్క్యులేట్ అవుతూ ఉంటాయి.అందులో పార్వర్డ్ మెసేజ్‌లే ఎక్కువగా ఉంటాయి.
ఇంక గుడ్ మార్నింగ్.హాయ్ అనే అనవసర ఛాటింగ్‌ ఇందులో మిగిలిన సభ్యులను ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
అలాగే పేపర్ క్లిప్పింగ్‌లు, యూట్యూబ్ లింకులు ఎడ తెగకుండా పడుతూ ఉంటాయి.ఇంకా చెప్పాలంటే వాట్సాప్ గ్రూపులు అనేవి ఓ డప్పింగ్ యాడ్‌లా మారుతున్నాయనడంలో సందేహం లేదు.
ఇలాంటి గ్రూపులలో కొన్ని మట్టిలో మాణిక్యాల్లాగా పని చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ గ్రూప్ గురించి మాట్లాడుకుందాం. గంగారం మండలం కొమట్లగూడెం గ్రామపంచాయతీ చుట్టుపక్కల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో సేవ దృక్పథం కలిగిన యువకులందరిని కలుపుకొని ఒక వాట్సప్ గ్రూపుని క్రియేట్ చేయడం జరిగింది ఒక మంచి కార్యక్రమానికి మొదలైన గ్రూపుకి దేవుని  (కోదండ రామ సేవ కమిటీ) పేరుతో ప్రారంభించినారు ఈ గ్రూపులో సైపా సురేష్ అందరికీ పెద్దన్న పాత్ర వహిస్తూ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిసిన మరు క్షణమే తన తోటి మిత్రులతో కలిసి కొంత మొత్తంలో ఆర్థిక సాయం అందిస్తూన్నాడు.
అయితే అక్కడి గ్రామాల్లో కొంతమంది ఊరిలో కొందరు, ఉద్యోగ రీత్య మరి కొంతమంది సొంత ఊరుకు దూరంగా ఉంటున్నారు.వారంతా కలిసి గ్రామ విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కోదండరామ సేవ కమిటీ వాట్సాప్ గ్రూపును అనేదానిని క్రియేట్ చేసుకున్నారు.దానిలో వారు అనవసర విషయాలను చర్చించకుండా, అనుబంధాలు, అభిప్రాయాలు పంచుకుంటున్నారు.111 మంది ఉన్న ఈ గ్రూపులో వచ్చిన ఓ విషాద మెసేజ్ సభ్యులను కలచి వేసింది
అదేమంటే, కుమట్లగూడెం గ్రామంలో నివసించే రత్నమ్మ కుడి కాలు వేల్లు పూర్తిగా తీసివేయడంతో ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తున్నాడంతో వారి బాధలను చూసిన గ్రూప్ సభ్యులు.వెంటనే ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేయాలని, ఆర్థిక చేయూత అందజేయాలని మ‌న కోదండరామ సేవా కమిటీ వాట్సాప్ గ్రూపు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.అకున్నదే తడువుగా 40 వేల రూపాయిలు సదరు బాధితురాలికి అందించి ఆదర్శంగా నిలిచారు. మానవత్వం నిండిన ఈ సంఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా గంగారం మండ‌లం కుమట్ల గూడెం గ్రామంలో జరిగింది.
Attachments area