ఓ మాంచి ప్రేమ కథాచిత్రమ్‌ చేస్తా

లవ్‌స్టోరీపై రకుల్‌ కామెంట్స్‌


తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు చేస్తూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బిజీగా ఉన్నారు. ఈ బ్యూటీ సినిమాల్లోకి వచ్చి దాదాపు పదేళ్లవుతోంది. ఇన్నేళ్లల్లో ఓ నలభై సినిమాల వరకూ చేశారామె. అయితే ఇప్పటివరకూ పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటించలేదు అంటున్నారు రకుల్‌. ఎలాంటి సినిమాలు చేయాలని ఉందో రకుల్‌ చెబుతూ.. సౌత్‌లో నేను డిఫరెంట్‌ సినిమాలు చేశాను. కానీ పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం చేయలేదు. నాకు రొమాంటిక్‌ లవ్‌స్టోరీస్‌ అంటే ఇష్టం. ’దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’, ’జబ్‌ వియ్‌ మెట్‌’, ’ఏ జవానీ హై దీవానీ’ వంటి లవ్‌స్టోరీస్‌ చేయాలని ఉంది. అలాగే బయోపిక్‌లో నటించాలని ఉంది. అయితే ప్రత్యేకంగా ఫలానా ప్రముఖుల బయోపిక్‌ అని పేర్లు చెప్పలేను. ఇతరులకు స్ఫూర్తి కలిగించేవారి జీవితాల్లో నటించడం బాగుంటుంది. అందుకే అవకాశం వస్తే ఎవరి బయోపిక్‌ అయినా చేస్తా. ఇంకా చారిత్రక చిత్రంలో నటించాలని ఉందని అన్నారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ’కెరటం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ఢల్లీి సోయగం అనతికాలంలోనే అగ్ర కథానాయికగా వెలుగొందింది. రెండు మూడేళ్ళ క్రీతం వరకు ఈమె పట్టిందల్లా బంగారమే. హిట్ల విూద హిట్లతో టాలీవుడ్‌ గోల్డెన్‌ లెగ్‌గా పేరు పొందింది. అయితే గత కొంత కాలం నుండి ఈమె గ్రాఫ్‌ పడిపోతూ వస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈమె జాడనే లేదు. గతేడాది వైశ్ణవ్‌ తేజ్‌తో కలిసి ’కొండపొలం’లో నటించింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఈమె నుండి మరో సినిమా రాలేదు. అయితే బాలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటీ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా గడుపుతుంది.
ప్రస్తుతం ఆమె నటించిన నాలుగు సినిమాలు షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు బాలీవుడ్‌వి కావడం విశేషం. ఇక మరో రెండు చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. అందులో ఒకటి తమిళ`తెలుగు ద్విభాష చిత్రంగా తెరకెక్కుతుంది.