కట్టుకున్న భార్యను రూ. 60 వేలకు అమ్మేసిన భర్త..

ఎంత ప్రయత్నించినా ఆమె అడ్డుతొలగకపోవడంతో, దూరపు బంధువైన మల్లయ్య దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికి భార్యను 60 వేల రూపాయలకు అమ్మేశాడు. అయితే ఈ విషయం మారుతాకు ఆలస్యంగా తెలిసింది. దీంతో ఆమె స్థానికుల సహాయంతో స్వగ్రామానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ విషయం తెలుసుకున్న స్థానిక మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో రాజు ఇంటికి చేరుకున్నారు. కట్టు కున్న భార్యను అమ్మేసిన రాజును కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పరారీలో ఉన్న రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలంరేపింది.