కడప ఉక్కు ఫ్యాక్టరీపై టిడిపి దొంగదీక్షలు
మండిపడ్డ రౌంట్ టేబుల్ సమావేశం
విజయవాడ,జూన్ 21(జనం సాక్షి): కడపలో ఉక్కు కర్మాగారం సాధనకై ఇంతకాలం టిడిపి ఎందుకు ఉద్యమించలేదని అఖిపక్ష భేటీలో నేతలు ప్రశ్నించారు. నాలుగేళ్లుగా బిజెపితో అంటకాగి ఇప్పుడు ధర్నాలు చేస్తే ఎవరు నమ్ముతారని నఅ/-నారు. కడప ఉక్కు కర్మాగార సాధనకై చేపట్టిన ఉద్యమానికి సంఘీభావంగా ప్రెస్‌క్లబ్‌లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వామపక్ష పార్టీలతో పాటు జనసేన, వైకాపా నేతలు హాజరయ్యారు. కడప ఉక్కు కర్మాగారం సహా విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటినీ అమలు చేయాలని ఈ సందర్భంగా రామకృష్ణ డిమాండ్ చేశారు. విద్యార్థి, ప్రజా సంఘాలు ఈ నెల 28న చేపట్టనున్న కడప జిల్లా బంద్‌కు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో అన్నారు.ఇప్పటికే 85 శాతం హావిూలను అమలు చేశామని చెబుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వాటిపై బహిరంగ చర్చలకు రావాలని రామకృష్ణ సవాల్ విసిరారు. అవాస్తవాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో భాజపాకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఎం సీనియర్ నేత వై.వెంకటేశ్వరరావు, ప్రత్యేక ¬దా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, పలు పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.