కడప ఉక్కు ఫ్యాక్టరీలో రాజకీయాలు
ఎవరికి వారు తామే గొప్ప అన్నచందంగా ప్రచారం
కడప,జూన్22(జనం సాక్షి ): కడప ఉక్కు విషయంలో టిడిపి దూసుకుని పోతోంది. ఈ విషయంలో వైకాపా ఎందుకు డిమాండ్ చేయడంలేదని ప్రశ్నిస్తోంది. అయితే ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో నాలుగేళ్లుగా పెద్దగా పోరాటం చేయని టిడిపి ఇప్పుడు వైకాపాను దెబ్బకొట్టేలా మాస్టర్ ప్లాన్ వేస్తోంది. వైకాపా కూడా కేవలం ప్రత్యేక¬దాతో ఇంతకాలం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. దీంతో ఉక్కు ఫ్యాక్టరీ విషయంలోతెలుగుదేశం పార్టీ వైసీపీని కార్నర్ సింది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నిరసన దీక్షకు దిగడం ఒక ఎత్తయితే దీనిని సాధించేందుకు జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు.ఈ ప్రాజెక్టు సాధన విషయంలో ప్రభుత్వ వైఫల్యం సంగతి పక్కన పెడితే..వైసీపీ కూడా ప్రత్యేక ¬దా విూదే ఎక్కువ ఫోకస్ పెట్టింది కానీ..కడప స్టీల్ ప్రాజెక్టుపై అడపాదడపా మాట్లాడటం తప్ప..ప్రతిపక్షం కూడా పెద్దగా చేసింది కూడా ఏవిూలేదనే చెప్పొచ్చు. రాజకీయంగా ఈ అంశాన్ని లేవనెత్తి అధికార పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నా.. వైసీపీ ఈ అంశాన్ని ఉపయోగించుకోవటం విపలం అయింది. అసెఎంబ్లీని బహిష్కరించడం ద్వారా తనకున్న వాయిస్‌ను పోగొట్టుకుంది. మరోవైపు బిజెపి కూడా ఎదురుదాడి చేస్తోంది. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హావిూతో ముందుకొచ్చినా అధికార తెదేపా, వైసీపీలతో పాటు కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు ఆందోళనలు, దీక్షలు చేపట్టడం ఉనికి కోసమేనని భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రాన్ని దోషిగా చూపటానికి ఇస్తున్న ప్రాధాన్యతలో కొంతకూడా పరిశ్రమ ఏర్పాటుకు కావలసిన సానుకూల వాతావరణాన్ని కల్పించడంలో చూపటం లేదని విమర్శించారు. కేందప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను మరచి స్వార్థం కోసం దీక్షలు చేయడం దారుణం అన్నారు. ఇకపోతే టీడీపీ ఎంపీ సిఎం రమేశ్ దీక్షకు కూర్చున్న తర్వాత జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ధర్నాలు..నిరసనలకు దిగిన వైకాపా 29న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. టీడీపీ నేతలు సహజంగానే ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ప్రతిపక్షం చేయాల్సిన పని తాము చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తే వైఎస్‌కు ఎక్కడ పేరు ప్రతిష్టతలు వస్తాయోనని భావించి తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఉక్కు పరిశ్రమను రానివ్వకుండా ఉక్కు పాదం మోపారని వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నాలుగేళ్లవుతున్నా ఏ ఒక్క హావిూ నెరవేర్చలేదన్నారు. ఎన్నికల దగ్గర పడుతున్నాయని రాజకీయ ప్రయోజనాల కోసం ఇరుపార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. కొంగ దీక్షలు, పోరాటాలు చేయడం తగదన్నారు. చిత్తశుద్ధితో మొదటి నుంచి వైకాపా ఉక్కు పరిశ్రమను తీసుకురావడానికి పోరాటం చేస్తోందన్నారు. ఉక్కు కోసం అఖిల పక్ష కమిటీ ఏర్పాటు అయిందునందున ఉద్యమాలు చేసి సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 23న కడపలో, 24న బద్వేలులో, 25న రాజంపేటలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నామని, 26న జమ్మలమడుగులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 దాకా మహాదీక్ష చేయనున్నామని ప్రకటించారు. 27న రహదారుల దిగ్బంధం, 29న జిల్లా బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. మొత్తంగా ఉక్కు సంకల్పం అన్ని పార్టీల్లోనూ కనిపిస్తున్నా, రాజకీయ లక్ష్యమే తమ టార్గెట్ అన్నది ప్రజలకు తెలుసు.