ఛత్తీస్‌గఢ్‌లో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ మృతి
ఛత్తీస్ గఢ్ లో (Chhattisgarh) ఘోరం జరిగింది. మావోయిస్టులు అమర్చిన మైనింగ్ బాంబు పేలడంతో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ (AP Jawan Martyred) అమరుడయ్యారు. రాజేష్ స్వస్థలం కడపలోని బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లె. జవాన్ మరణ వార్త తెలియగానే పాపిరెడ్డిపల్లెలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. నేడు స్వగ్రామానికి జవాన్ పార్దీవదేహం చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు. జవాన్ రాజేష్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్టు సమాచారం.
బ్రహ్మంగారి మఠం
వీర మరణం పొందిన జవాన్ కొడవటి కంటి రాజేష్
బ్రహ్మంగారి మఠం మండలంలోని పాపిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కొడవటికంటి రాజేష్, చతిస్గడ్‌లోని మిజాపూర్‌లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)లో జవాన్‌గా పనిచేస్తున్నారు. శనివారం నక్షల్స్ అమర్చిన మైనింగ్ బాంబ్ పేలి ఆయన మరణించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.