కత్తిపూడి నుంచి మొదలైన జగన్ పాదయాత్ర
వైకాపాలో చేరిన నటుడు కృష్ణుడు
కాకినాడ,ఆగస్ట్6(జనం సాక్షి ): ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 230వ రోజుకు చేరింది. సోమవారం ఉదయంతూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి నెల్లిపూడి, శ్రీశాంతి ఆశ్రమం క్రాస్ విూదుగా శంఖవరం వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. కాగా, వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ పాదయాత్ర సాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన 2656.1 కిలోవిూటర్లు నడిచారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు జయంతి సందర్భంగా కత్తిపూడిలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి వైఎస్ జగన్ నివాళులర్పించారు. కార్యక్రమంలో జక్కంపూడి రాజా, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే వైఎస్ జగన్ పాదయాత్రకు ఆకర్షితుడై సినీ నటుడు కృష్ణుడు వైఎస్సార్‌సీపీలో చేరారు. సోమవారం పాదయాత్రలో భాగంగా కత్తిపూడిలో వైఎస్ జగన్ సమక్షంలో నటుడు కృష్ణుడు వైఎస్సార్ సీపీలో చేరారు. కృష్ణుడికి పార్టీ కుండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ.. జననేత వైఎస్ జగన్ పాదయాత్రతో స్ఫూర్తి పొంది తాను పార్టీలో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీలో వైఎస్సార్ సీపీ విజయం సాధించడానికి తన వంతు కృషి చేస్తానని కృష్ణుడు పేర్కొన్నారు. ఈ క్యార్యక్రమంలో పార్టీ నేతలు పెన్మత్స సురేష్ బాబు, సర్రాజు, సూర్యనారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు.