కదిలించే కథ ”ఈద్గా”
కథలు లేకుండా మనిషి జీవితాన్ని ఊహించలేం. కథలు లేకుంటే మనిషి పిచ్చివాడైపోతాడు. పాట నుంచి మొదలైన మనిషి జీవితం కథ నుంచి కొనసాగుతుంది. మనిషి చనిపోయిన తరవాత కూడా కథలాగా కొనసాగుతుంది. కథలు ఏం చేస్తాయి. కథలు మనల్ని ఆలోచింపచేస్తాయి. కొన్ని కథలు నవ్విస్తాయి. కొన్ని కథలు మన కళ్లు తెరిపిస్తాయి. కొన్ని కథలు మన కళ్లల్లో గడ్డకట్టిన కన్నీళ్లని ప్రవహింప చేస్తాయి. మనసు కరిగిపోతుంది. కథల్లో మనకు తెలియని మహాత్తు ఉంది. ఈ మధ్య అలాంటి కథ చాలా రోజుల తరువాత మళ్లీ చదివాను. అది ప్రపంచంలోని గొప్ప కథకుల్లో ఒకడైన మున్సీ ప్రేంచంద్ కథ ‘ఈద్ పండుగ’. ఈ కథ చదివిన వ్యక్తుల కళ్లు కూడా ఆ కథలోని హమీద్ నానమ్మ అమీనాతో పాటు వర్షిస్తాయి. మనిషిగా ఎలా వుండాలో ఆలోచింప చేస్తాయి. ఈ కథలో ప్రేమా, మానవత్వం అనుబంధం ఎన్నో కలగలిపి ఉంటాయి.
మున్షీ ప్రేంచంద్ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాంఘీక జీవనంలో మనిషి తనాన్ని, మంచి తనాన్ని పెంపొం దించడానికి తన రచనల ద్వారా కృషి చేసిన మహరచయిత ఉర్దూ లో హిందీలో కథలు, నవలలు, సంపాదకీయాలు రాసిన మహానీ యుడు, పిల్లల మానసిక ప్రవర్తన గురించి కూడా గొప్ప కథలు రాశాడు. అలాంటి కథే ‘ఈద్ పండుగ’ మన మనస్సులని కదిలించే కథ. మన భావోద్వేగాలకి చలనం ఇచ్చే కథ. ప్రేంచంద్ రాసిన కథ ల్లో చాలా గొప్ప కథ ‘ఈద్ పండుగ’ ఈ కథ ఈద్గా (మసీదు) పేరు తో అనువాదం అయ్యింది.
హమీద్ అనే చిన్న కుర్ర వాడి కథ. అతను పేదవాడు. ఐదారు సంవత్సరాల ప్రాయం ఉన్నవాడు. తల్లి, దండ్రులను కోల్పోయి హీన మైన దీనస్థితిలో ఉన్న కుర్రవాడు. జీవితంలో రాజీపడి, సాంఘీక జీవితానికి దూరంగా అతని బాల్యం వికసించే వయస్సులో బతుకు ను కొనసాగిస్తున్న పిల్లవాడు హమీద్. కానీ అతనికి గొప్ప ఆశ వుం డి. అల్లా దగ్గర ఉన్న తన అమ్మ నాన్న తిరిగి వస్తారని, తనకి ఎన్నో బొమ్మలు చేస్తారని, ఎంతో డబ్బు కూడా తెస్తారని ఆశతో జీవిస్తున్న బాలుడు హమీద్. తన తల్లి దండ్రులు తిరిగి రాని లోకాలకి వెళ్లి పోయారన్న విషయం తెలియని అమాయకుడు హమీద్.
ఇలాంటి జీవితం ఉన్న హమీద్‌కి ఉన్న ఏకైక ఉపశమనం అతని నానమ్మ అమీనా. తన వెచ్చని ప్రేమతో హమీద్ చుట్టూ ఆశ ల సౌధాన్ని నిర్మించి అతన్ని పోషిస్తున్న అమీనా. పండుగ కోసం ఆమె నిలువ వుంచి కాపాడిన సొమ్ము ”మూడు పైసలు” పండుగ రోజు బజార్లో కన్పించే బొమ్మలు, స్వీట్స్, తిను బండారాలు, గాలి బుడగలు, బెలూన్లు ఎదైనా కొనుక్కోవడానికి ఆమె కష్టంగా మిగి ల్చిన డబ్బులు ‘మూడు పైసలు’ ఆ డబ్బుతో హమీద్ తనకిష్టమైన వాటిని కొనుక్కోవాలి.
ఆ మూడు పైసలతో అతని డబ్బున్న స్నేహితుల కన్నా తల్లి దండ్రుల ప్రేమలో బాల్యం వికసిస్తున్న మిగతా స్నేహితులు కన్నా అ త్యంత విలువైన వస్తువుని హమీద్ కొనుక్కున్నాడు. అతని స్నేహి తుల జేబుల నిండా డబ్బులు. హమీద్ దగ్గర ఉన్నవి. మూడు పైస లు. అందరూ తమకిష్టమైన బొమ్మలని, తినుబండారాలను కొను క్కుంటున్నప్పుడు తన మూడు పైసలతో ఏం కొనుక్కోవాలో అని ఆలోచించిన బాలుడు హమీద్. అతని స్నేహితులు తమకు కావా ల్సిన బొమ్మలని, అదేవిధంగా నోరూరించే స్వీట్స్‌ని కొను క్కొని పండుగని ఆనంది స్తుంటే చాలా మౌనంగా ఉన్న వ్యక్తి హమీద్.
అతని స్నేహితులు నోరూరించే జిలేబీ తినుమని ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాక్కుంటే ఏమీ మాట్లాడని వ్యక్తి హమీద్. హమీద్ జీవితం లోని క్లిష్టపరిస్థితులు, ఆటంకాలు తెలియకుండా అతన్ని ఆట పట్టి స్తారు. అతని స్నేహితులు. హమీద్ జీవితంలోని క్లిష్టపరిస్థితులు అత న్ని పండుగ ఉత్సాహంతో నియంత్రిస్తాయి. ఇలాంటి దిగ్బ్రమ పరిస్థి తిలో చాలా దుకాణాలను దాటి ఇనుప పస్తువులని అమ్మే దుకాణం వైపు వస్తాడు. పిల్లలని ఎవరినీ ఆకర్షించే అవకాశం లేని దుకాణం అది. అక్కడ కన్పించిన ‘చిమ్టా’ అతన్ని ఆ దుకాణంలోకి వెళ్లడానికి అవకాశం కల్పిస్తుంది. వేడి వస్తువులని పొయ్యిమీద నుంచి తీసే ‘పట్టుకారు’ అతన్ని ఆకర్షిస్తుంది. తన చేతుల్ని కాల్చుకుంటూ వేడి వేడి వస్తువులని, దించే నానమ్మ అతని కళ్లల్లో మెరుస్తుంది. అతి హృదయం బాధతో మూలుగుతుంది. ఒక ధృడ నిశ్చయం చేసుకొని దాని ధరని అడుగుతాడు. ఆ షాపువాడు హమీద్‌ని వింతగా చూస్తా డు. ఆయన దాని ధర ఆరుపైసలని చెబుతాడు. ఇచ్చే ధర చెప్పమని అడుగుతాడు. ఐదుపైసలని చెబుతాడు షాపువాడు. మూడు పైసల కివ్వమని అడిగి సమాధానం కోసం చూచుచుండగా షాపు నుంచి బయల్దేరతాడు. షాపువాడు అతన్ని పిలిచి అతను కోరిన మూడు పైసకే ఆ ‘చిమ్టా’ని ఇస్తాడు.
ఒక ఒక సవాలు నుంచి మరో సవాలులోకి హమీద్ ప్రయాణం చేస్తాడు. ఆ చిమ్టాని దాచడం ఒక సవాలైతే దాన్ని ఇంటికి తీసుకుని వెళ్లడం మరో సవాలుగా పరిణమిస్తుంది. ఆ చిమ్టాని కొన్నందుకు అతని స్నేహితులంతా అతన్ని ఎగతాళి చేస్తారు. కానీ అవేమీ పట్టిం చుకోడు. వాళ్లు కొన్న బొమ్మలు కింద పడితే పగిలిపోతాయని, మట్టి లో కలిసిపోతాయని వాళ్లకి తగురీతిలో జవాబులు చెబుతాడు. తన చిమ్టా కింద పడినా పగలదని, దానికి ఏమీ కాదని, తన వంటింట్లో అది హీరో లాగా ఉంటుందని చాలా విశ్వాసంగా చెబుతాడు. అతని తర్కానికి మిగతా స్నేహితులు ఏమీ మాట్లాడకుండా అయిపోతారు. అతని ధైర్యానికి ధృడ నిశ్చయానికి వాళ్లు దాసోహమవుతారు. తమ బొమ్మలని తీసుకొని చిమ్టా ఇవ్వమని ఒకరిద్దరు అడుగుతారు. కానీ అది అమ్మకానికి కాదని జవాబు చెప్పి ఇంటివైపు దారి వస్తాడు.
హమీద్ ఇంటికి రాగానే అమీనా అతన్ని దగ్గరకు తీసుకొని ఏం కొన్నావని అడుగుతుంది. హమీద్ దగ్గర బజార్లో మంచి సమయం గడిపాడని ఆమె అనుకుంటుంది. అతని దగ్గర ఉన్న చిమ్టాని ఆమె గమనిస్తుంది.
ఈ చిమ్టా ఎక్కడిది అడుగుతుంది
నేనే కొన్నాను జవాబు చెబుతాడు హమీద్
ఎంతకు కొన్నావు
మూడు పైసలు
ఆమె గుండెలు బాదుకుంటుంది. పొద్దటి నుంచి ఏమీ తిన కుండా ఈ చిమ్టాని కొన్నావా? అక్కడ ఇది తప్ప నీకు మరేమీ కన్పించలేదా? బాధతో అడుగుతుంది. ఆ కుర్రవాడు పిచ్చివాడా అ ని అనుకుంటుంది.
నువ్వు వేడి గిన్నెలను పొయ్యిమీది నుంచి దించుచు న్నప్పుడు, చెయ్యి కాల్చుకుంటున్నావు కదా! అందుకే అది కొన్నాను అని బాధపడ్డ గొంతుతో అంటాడు హమీద్. వృద్ధురాలైన అమీనా కోసం గుప్పున చల్లారిపోతుంది. అది ప్రేమగా మారిపోతుంది. అది మాటలతో లెక్కించే ప్రేమ కాదు. అది మౌనంగా మారిన ప్రేమ. హమీద్ ను గుండ ెకు హత్తుకున్న మాటలు లేని ప్రేమ. పిల్లలందరూ అక్కడ బొమ్మలు కొనుక్కుంటే, స్వీట్లు తింటుంటే తన కోరికలను అణుచుకొని నానమ్మని గుర్తుంచుకుని తెచ్చిన చిమ్టా. అమీనా హృదయం మాటలు చెప్పలేక మౌనంగా ఆనందంతో రోధించింది. అక్కడ పరి స్థితి విచిత్రంగా మారింది. చిమ్టా ఆ పరిస్థితిని మార్చింది. హమీద్ చిమ్టాని చేపట్టిన పెద్దవాడిలా అమీనా చిన్న పిల్లలా మారిపోయింది.
అమీనా కన్నీళ్ల పర్యంతమైపోయింది. తన కొంగును చాపి తన మనవడిని ఆశీర్వదించించమని అల్లాని వేడు కుంది.ఆమె కళ్ల నుంచి కన్నీళ్ల ధార. ఆమెలో జరుగుతున్న అంతర్మథనం హమీద్‌కి ఏం అర్థ మవు తుంది ! కథ ఇక్కడ ముగుస్తుంది. అంతర్మథనం కథ చది విన పాఠకుల్లో మొదలవుతుంది.అమీనానే కాదు. కథ చదివిన వ్యక్తులం దరూ కన్నీళ్ళ పర్యంతమవుతారు.రేపటి మీదఆశ మొలకెత్తుతుంది. బాధని అంతం చేసే ఆయుధం దొరికినట్ల నిపిస్తుంది.ఆకర్షణల వైపు ఎలా నిలువరించు కోవాలో తెలిస ివస్తుంది. ఇతరుల గురించి ఎలాపట్టించు కోవాలో బోధపరుస్తుం ది. పరిపక్వత ముందు వయస్సు అనుభవం తక్కువే అని తెలుస్తుం ది. కథలు ఏం చేస్తాయి. ఆలోచింప చేస్తాయి. అనుభవాన్ని స్తాయి. కనులు విప్పి లోకాన్ని చూడమంటాయి. కథలు మనల్ని కరిగి స్తాయి. అందుకు ఉదాహరణే ప్రేంచంద్ రాసిన ‘ఈద్ పండుగ’.