కనకదుర్గమ్మకు రూ.లక్ష విరాళమిచ్చిన భక్తురాలు
విజయవాడ, జూలై 28 : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భాగ్యమ్మ అనే భక్తురాలు లక్షరూపాయల విరాళం అందజేసింది. శనివారం ఆమె ఆలయ కార్య నిర్వహణాధికారి రఘునాథ్‌ను కలసి లక్షరూపాయల చెక్కును అందచేసింది. తన కుటుంబంపై కరుణ చూపుతూ, అందరిని కాపాడుతున్న కనకదుర్గమ్మకు ఉడతా భక్తిగా ఈ విరాళం అందించినట్లు ఆమె తెలిపారు. ఈ విరాళంతో ఆలయ అభివృద్ది పనులను వెచ్చించాలని ఆమె కోరారు. విరాళం అందించిన భాగ్యమ్మకు ఆలయ నిర్వాహణాధికారి రఘునాథ్ అభినందించారు. అనంతరం ఆలయ మర్యాదలతో భాగ్యమ్మకు దుర్గామాత దర్శనం కల్పించారు. పసుపు, కుంకుమలు, అమ్మవారి ప్రసాదం ఆమెకు అందించారు.