కన్నడ తెలుగువారు కాంగ్రెస్‌ వెంటే

బిజెపిని నమ్మడం లేదన్న మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌
బెంగుళూరు,మే2( జ‌నం సాక్షి): తెలుగువారికి జరిగిన అవమానం కారణంగా కర్నాటక తెలుగువారెవరూ బిజెపికి ఓటేయరని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ నాయకుడు  నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఎపికి ప్రత్యేక¬దా ఇస్తామని మోసం చేసిన ప్రధాని మోడీ అంటేనే ఇప్పుడు తెలుగు ప్రజలు మండిపడుతున్నారని అన్నారు. కర్నాటకలో తెలుగువారు ఉండే ప్రాంతా/-లో కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. సిఎం సిద్ధరామయ్య చేసిన అభివృద్ధి పనులు ప్రజల్లోకి వెళ్లాయని మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. సిద్ధరామయ్య అందించిన సుపరిపాలనపై ప్రజలు సంతృప్తికంగా ఉన్నారన్నారు. ప్రత్యేక ¬దా విషయంలో ప్రధాని మోదీ ప్రజలను ఎలా మోసం చేసారో కర్ణాటకలోని తెలుగువారికి తెలిజేస్తున్నామన్నారు. కర్ణాటకలో వున్న 1.10 కోట్ల తెలుగువారు బీజేపీకి వ్యతిరేకంగా వున్నారని తెలిపారు. బీజేపీకి ఓటు వేయకూడదని తెలుగువారు డిసైడ్‌ అయ్యారని నాదెండ్ల విూడియాతో మాట్లాడుతున్న సందర్భంగా తెలిపారు. దీంతో బీజేపీ అయోమయంలో పడిపోయిందన్నారు. ఎన్నికల తరువాత బీజేపీతో జేడీఎస్‌ కలిసిపోతుందని జోస్యం చెప్పారు. గాలి, యడ్యూరప్ప మధ్య అంతర్గత పోరు రాజ్యమేలుతోందన్నారు. బిజెపిని నమ్ముకుంటే నట్టేట మునుగుతారని అన్నారు. అందువల్ల కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరామని అన్నారు.