కన్నాట్‌ప్లేస్‌లో స్మాగ్ టవర్
ప్రారంభించిన సిఎం కేజ్రీవాల్
న్యూఢల్లీి,అగస్టు23(జనంసాక్షి): ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఢల్లీిలోని కన్నాట్‌ప్లేస్‌లో స్మాగ్ టవర్‌ను ప్రారంభించారు. ఢల్లీిలో వాయు కాలుష్యం ఏటికేడు తీవ్రమవుతుండటంతో స్మాగ్ టవర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆప్ సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు కన్నాట్ ప్లస్‌లో మొదటి స్మాగ్ టవర్‌ను ప్రారంభించింది. స్మాగ్ టవర్‌ను ప్రారంభించిన అనంతరం కేజ్రివాల్ మాట్లాడుతూ.. ఇకపై ఢల్లీిలో ఎయిర్ పొల్యూషన్‌కు అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కాలుష్యంపై పోరాటంలో భాగంగా ఇవాళ తాము దేశంలో తొట్టతొలి స్మాగ్ టవర్‌ను ఢల్లీిలో ప్రారంభించామని, ఈ స్మాగ్ చుట్టూ ఒక కిలోవిూటర్ పరిధిలో గాలిని శుభ్రం చేస్తుందని కేజ్రివాల్ తెలిపారు. ప్రయోగాత్మకంగా తాము ఈ స్మాగ్ టవర్‌ను ప్రారంభించామని, ఈ స్మాగ్ టవర్ పనితీరుకు సంబంధించిన డేటాను ఐఐటీ ఢల్లీి, ఐఐటీ బాంబే పరిశీలించనున్నాయని ఆయన చెప్పారు. ఆ డాటా ఆధారంగా భవిష్యత్తులో స్మాగ్ టవర్ల ఏర్పాటుపై నిర్ణంయ తీసుకుంటామన్నారు.