కన్నాల గ్రామపంచాయతీని పరిశీలించిన ఐటీడీఏ పీవో

పల్లి,సెప్టెంబర్29,(జనంసాక్షి)
బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీని గురువారం ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి పరిశీలించారు. పోడు భూముల సర్వేలో భాగంగా కన్నాల గ్రామపంచాయతీని పరిశీలించామని ఆయన తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయంలోని రికార్డులను, అప్లికేషన్లను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో రాజేందర్, ఎంపిఓ శంకర్ రాథోడ్, ఎఫ్ఆర్సి కమిటీ చైర్మన్ సోమని శైలజ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.