కన్నుల పండుగ గా రత్నగిరి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు
హాజరైన హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్
భీమదేరుపల్లి మండలం ఆగస్టు (27) జనంసాక్షి న్యూస్
కన్నుల పండుగగా రత్నగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం మండలంలోని రత్నగిరి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలను గ్రామ సర్పంచ్ వంగ సురేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు అనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ ,ఎంపీపీ జక్కుల అనిత రమేష్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో చివరి శనివారం రత్నగిరి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలను నిర్వహిస్తామని అందులో భాగంగా ఈ సంవత్సరం నిర్వహించామని ఈ జాతరలో భక్తులు ఎడ్లబండ్లను, ట్రాక్టర్లను గుడి చుట్టూ తిప్పారన్నారు. భక్తులకు ఎలాంటి అవాంజనేయ సంఘటనలు జరగకుండా వంగర ఎస్సై మౌనిక రెడ్డి బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యాలు కలవకుండా
సౌకర్యాలు ఏర్పాటు చేసి త్రాగునీటి సౌకర్యం దేవాలయ కమిటీ కల్పించారు. జాతర స్థలంలో భక్తుల కోసం వ్యాపారస్తుల దుకాణాలు వెలిశాయి.