కన్నుల పండువగా ఆస్కార్‌ లైఫ్‌ఆఫ్‌పైకి అవార్డుల పంట

ఉత్తమ చిత్రంగా ఆర్గో
లాస్‌ఏంజిల్స్‌, ఫిబ్రవరి 25:
ప్రపంచ సినిమా వేడుకలు అట్టహాసంగా ముగి శాయి. ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండువగా సాగింది. భారతీయత నేపథ్యంలో రూపొందించిన ‘లైఫ్‌ ఆఫ్‌ పై’కి ఆస్కార్‌ అవార్డుల పంట పడింది. ఉత్తమ దర్శకుడితోపాటు నాలుగు విభాగాల్లో ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ అవార్డులు దక్కిం చుకుంది. ఈ చిత్రానికి యాంగ్‌లీ ఉత్తమ దర్శకు డిగా ఎంపికయ్యారు. ఉత్తమ సినిమాటోగ్రఫీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాల్లోనూ ఈ సినిమా తన ప్రతిభను చాటుకుంది. బెన్‌ అఫ్లెక్‌ ‘ఆర్గో’ ఉత్తమ చిత్రం అవార్డును ఎగురేసుకుపో యింది. మిగతా చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నా.. చివరకు ఆర్గో అవార్డును కైవసం చేసుకుంది. ప్రపంచ చలన చిత్ర రంగంలో అత్యున్నతంగా భావించే 85వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలు సోమ వారం తెల్లవారుజామున అట్టహాసంగా ప్రారం భమయ్యాయి. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ఏంజెల్స్‌లోని కొడాక్‌
థియేటర్‌లో ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. హాలీవుడ్‌ దిగ్గజాలు తరలిరావడంతో సందడి నెలకొంది. బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డుగా లైఫ్‌ ఆఫ్‌ పై దర్శకుడు ఆంగ్‌ లీ ఎంపికయ్యారు. ఇక ఉత్తమ నటుడి అవార్డును డేనియల్‌ డే లూయీస్‌ ఎగురేసుకుపోయారు. ‘లింకన్‌’ చిత్రంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఉత్తమ నటిగా జెన్నిఫర్‌ లారెన్స్‌ నిలిచారు. సిల్వర్‌ లైనిగ్స్‌ ప్లేబ్యాక్‌ చిత్రంలో నటనకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది.
అస్కార్‌ అవార్డుల విజేతల వివరాలు:
ఉత్తమ చిత్రం: ఆర్గో
ఉత్తమ నటుడు : డెనియల్‌ డే (లింకన్‌)
ఉత్తమ నటి: జెన్నీఫర్‌ లారెన్స్‌
ఉత్తమ దర్శకుడు: ఆంగ్‌లీ (లైఫ్‌ ఆఫ్‌ పై)
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: లైఫ్‌ ఆఫ్‌ పై
ఉత్తమ యానిమేషన్‌ చిత్రం: బ్రేవ్‌
ఉత్తమ సినిమాటోగ్రఫీ : క్లాడియో మిరాండ (లైఫ్‌ ఆఫ్‌ పై)
ఉత్తమ నేపథ్య సంగీతం – మైకేల్‌ డన్నా (లైఫ్‌ ఆఫ్‌ పై)
ఉత్తమ యానిమేషన్‌ లఘు చిత్రం: పేపర్‌ మ్యాన్‌
ఉత్తమ సహాయ నటు-డు : క్రిస్టోఫో వాజ్‌ (డిజాంగో అన్‌ చైన్డ్‌)
ఉత్తమ సహాయ నటి: అన్నే హథవే
ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌: కర్ఫ్యూ
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: సెర్చింగ్‌ ఫర్‌ షుగర్‌ మేన్‌
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: అమోర్‌ (ఆస్టియ్రా)
ఉత్తమ లఘు డాక్యుమెంటరీ చిత్రం: ఇనోసెంటీ-
ఉత్తమ కాస్టూమ్‌ డిజైనర్‌ : జాక్వెలైన్‌ డుర్రాన్‌ (అన్నా కరేనికా)
ఉత్తమ ఎడిటింగ్‌: ఆర్గో