కబడ్డీ పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలి

 

 

 

 

హుజూర్ నగర్ డిసెంబర్ 13 (జనంసాక్షి): రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో రాణించి మొదటి స్థానం సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని వాసవి భవన్లో 10 రోజులుగా సాధన చేస్తున్న సబ్ జూనియర్ కబడ్డీ క్రీడాకారులను పరిచయం చేసుకుని ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడారు. జాతీయ పోటీలకు ఆతిథ్యమిచ్చే ఇండోర్ స్టేడియంలో మ్యాట్లపై నిర్వహించే విధంగా క్రీడాకారులకు సాధన ఇప్పించటం మంచి ఫలితాలను సాధించేందుకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. శిక్షణా శిబిరం నిర్వహణకు కృషిచేసిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు బెల్లంకొండ రామచంద్ర గౌడ్, జాతీయ సీనియర్ కబడ్డీ క్రీడాకారులు, కోచ్ దేవరం రవీందర్ రెడ్డి, ఎరగాని గోవింద్ గౌడ్ వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్ సునీల్ కుమార్, సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు మస్తాన్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, కడియం వెంకట్ రెడ్డి, ఎస్సై వెంకట్ రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.