కమిషన్ బకాయిలు విడుదల చేయాలి,
రేషన్ డీలర్ల డిమాండ్,
(జనం సాక్షి),కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని రేషన్ షాప్ డీలర్లు తమకు గత నాలుగు నెలల నుండి రావాల్సిన కమీషన్ మొత్తాన్ని దసరా పండుగ దృష్ట్యా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులకు పంపిణీ చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ కాంట బ్లూటూత్ తో సరిపడ కిలోలు ఇస్తున్నామని గోదాం నుండి రేషన్ షాపులకు ఎగుమతి చేసే సమయంలో తూకం వెయ్యకపోవడంతో తమకు వచ్చే బస్తాలలో బస్తాకు మూడు నుంచి ఐదు కిలోల తరుగు వస్తుందని, మాకు కూడా గోదాం నుండి ఇచ్చేటప్పుడు క్వాంటిటీ ప్రకారం గన్ని సంచుల బరువుతో సహా
ఇవ్వాలని డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా తెలంగాణ
ప్రభుత్వం రేషన్ షాప్ డీలర్ల సమస్యను పరిష్కరింపజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బుర్ర చరణ్
బొల్లి రవి పాల అనసూయ రాజేశం అటికం శంకర్ డీలర్, ఎం సదానందం ఎం లక్ష్మి పాల్గొన్నారు.