కమ్యూనిస్టుల పోరాటం తోటే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం
కోటగిరి సెప్టెంబర్ 17 జనం సాక్షి:-సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో కోటగిరి బస్టాండ్ వద్ద జాతీయ జెండాను సిపిఐ మండల కార్యదర్శి ఏ విటల్ గౌడ్ ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నైజాం ప్రభువు కబంధహస్తాల్లో ఉన్నదని,అప్పటికే రజాకార్ల వ్యవస్థ రైతులను,ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న దశలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన రైతులు, ప్రజలు రజాకార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా,హైద్రాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి.ఈ ఉద్యమంలో 4వేల మంది కమ్యూనిస్టు నాయకులు ప్రాణ త్యాగం చేశారనీ,వారి త్యాగ ఫలితమే 3000 గ్రామాలు వెట్టి చాకిరి నుండి విముక్తి కాబడ్డాయని.అలాగే 10 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని అన్నారు. ఆర్ఎస్ఎస్,బిజెపి లు తెలంగాణ ఉద్యమ చరిత్రను ముస్లిం రాజు, హిందువులకు మధ్య గొడవ జరిగిందని చరిత్రను వక్రీకరిస్తున్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బిజెపికి సంబంధమే లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు నల్లగంగాధర్,దత్తు, రాములు,రాజు,తదితరులు పాల్గొన్నారు.