కరవు యాత్రను ప్రారంభించిన కోదండరామ్‌

Kodandaramఆదిలాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా ముథోల్‌ మండలం బిద్రెల్లిలో రైతు కరవు యాత్రను తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం ప్రారంభించారు. కరవు పరిస్థితులపై బృందం అధ్యయనం చేయనుంది. ఈ సందర్భంగా గ్రామస్థులు కోదండరామ్‌కు ఘనస్వాగతం పలికారు. కరవు పరిస్థితులపై ఆయన రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రవిందర్‌, కార్యదర్శి విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోందండ రామ్‌ మాట్లాడుతూ రైతుల దుర్భర పరిస్తితులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు.