కరీంనగర్‌లో జోరుగా అభివృద్ది పనులు: వినోద్‌

కరీంనగర్‌,జూన్‌7(జనం సాక్షి):

రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్‌ బోయిన్‌పల్లి వినోద్‌ కుమార్‌ సోమవారం ఉదయం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని వినోద్‌ తెలిపారు. రూ.196 కోట్లతో పనులు జరుగుతున్నాయని.. త్వరలో మరో రూ.200 కోట్లతో పనులు ప్రారంభిస్తామన్నారు. కరోనా వల్ల అభివృద్ధి పనులు కొంత ఆలస్యం అయ్యాయని వినోద్‌ కుమార్‌ తెలిపారు. అయితే త్వరగా పూర్తి చేసేందుకు అదికారులు ప్రయత్నిస్తున్నారని అన్నారు.