కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట సైకో బీభత్సం

కరీంనగర్‌: జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఓ సైకో బీభత్సం సృష్టించాడు. కలెక్టర్‌ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఎక్సైజ్‌ కార్యాలయం ప్రాంగణంలోని ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన సైకో.. పలు వాహనాలను ధ్వంసం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మానసిక రోగంతో బాధపడుతున్న ఆ వ్యక్తి నేపాల్‌కు చెందిన వాడిగా స్థానికులు భావిస్తున్నారు.