కరీంనగర్ చంద్రబాబుకు తెలంగాణ సెగ
కరీంనగర్: ‘ వస్తున్న మీ కోసం’ పాదయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. గంగాధర మండలం బూర్గుపల్లిలో జైతెలంగాణ నినాదాలు చేస్తూ ఆయన పాదయాత్రను టీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని చెప్పాలంటూ నినాదాలు చేశారు. ప్రతి నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. ప్రతిగా టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు కూడా ప్రతిదాడి చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. టీఆర్‌ఎస్వీ కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.