కరీంనగర్ జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలుళ్లు
ఇద్దరికి గాయాలు…… ఇళ్లు ధ్వంసం
కరీంనగర్: జిల్లాలోని తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ వద్ద గుట్టల్లో శనివారం సాయంత్రం జిలెటిన్ స్టిక్స్ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లతో ఇళ్లపైకి రాళ్లు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలుకాగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.