కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

1qr2inuuలారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారం మండలం బంజేరుపల్లి దగ్గర ఎదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ శ్రీనివాస్ క్యాబిన్ లో ఇరుక్కున్నాడు. దాదాపు రెండు గంటలు నరకయాతన అనుభవించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు, పోలీసులు జేసీబీలు, గ్యాస్ కట్టర్లతో క్యాబిన్ భాగాన్ని తొలగించారు. డ్రైవర్ ని బయటికి తీసి, 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.