తుపాకీతో సమావేశాలకు హాజరైన జడ్పీటీసీ సభ్యుడు
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కాటారం మండలం జడ్పీటీసీ నారాయణ రెడ్డి జిల్లా పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరానికి తన లైసెన్స్ తుపాకి తీసుకురావడంతో రసాభాస చోటు చేసుకుంది. జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలు జరుగుతున్న సమయంలో తుపాకి తీసుకురావడం మంచిదికాదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. దీంతో జడ్పీటీసీ నారాయణ రెడ్డి బయటకు వెళ్లి తన తుపాకిని గన్‌మెన్‌కి ఇచ్చి తిరిగి సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్తు ా’య్రర్‌పర్సన్ ఉమ జడ్పీటీసీ నారాయణరెడ్డిని మందలించి సమావేశ మందిరంలోకి తుపాకులను తీసుకురావద్దని సూచించారు.