కరువొచ్చింది

2

– సాయం చేయండి

న్యూఢిల్లీ,డిసెంబర్‌28(జనంసాక్షి):తెలంగాణలో కరువు కింద రూ.2514 కోట్ల కేంద్ర కరువు సహాయం చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.  కరువు సాయం కింద రూ.3వేల కోట్లు మంజూరు చేస్తారని ఆశిస్తున్నామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ వ్యవసాయ శాఖకు 2015-16 సంవత్సరంలో రూ.103కోట్లు కేటాయించాల్సి ఉందన్నారు.   కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశం అనంతరం పోచారం విూడియాతో మాట్లాడారు. రాష్ట్రరైతాంగ సమస్యలు, పరిస్థితులను కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించి కేంద్రానికి నివేదిక అందజేశాయి. కేంద్ర బృందం పరిశీలనలో ఎక్కువ నష్టం జరిగినట్లు తెలిసింది. కరువు సాయం అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారురాష్ట్రానికి రూ.2514 కోట్ల కరువు సాయం చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కోరినట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితెలిపారు. ఢిల్లీలో రాధామోహన్‌ సింగ్‌తో సమావేశమైన పోచారం.. రాష్ట్రరైతాంగ సమస్యలు, పరిస్థితులను కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించి కేంద్రానికి ఇచ్చిన నివేదిక ప్రకారం కరువు సాయం అందిస్తామని కేంద్రమంత్రి చెప్పినట్లు పోచారం తెలిపారు. కరువు సాయం కింద రూ.3వేల కోట్లు మంజూరు చేస్తారని ఆశిస్తున్నామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ వ్యవసాయ శాఖకు 2015-16 సంవత్సరంలో రూ.103కోట్లు కేటాయించాల్సి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీడ్‌ కార్పోరేషన్‌ను బలోపేతం చేస్తున్నామని పోచారం తెలిపారు..రాష్ట్రవ్యాప్తంగా సీడ్‌ కార్పోరేషన్‌ను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.  తెలంగాణకు కరువు సాయం తక్షణం విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరానని తెలిపారు. కరువుసాయాన్ని ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో జమచేస్తామన్నారు. సర్వే నెంబర్ల ఆధారంగా పంటనష్టపోయిన రైతుల వివరాలు సేకరించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పలు రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమని వెల్లడించారు. అలాగే ములుగులో ఉద్యాన వర్సిటీ శంకుస్థాపనకు రావాలని కోరామన్నారు. అందుకు కేంద్రమంత్రి అంగీకరించారని అన్నారు. వ్వయసాయరంగంలో ఉద్యానం ప్రధానపాత్ర పోషిస్తోందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని వేగంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.