కరోనా ఆపత్కాల సమయంలో మెడికల్ కాలేజ్ సేవలు భేష్

వేలాది మంది ప్రాణాలను నిలబెట్టిన ఘనత ఇక్కడి వైద్యులది

సూర్యాపేట మెడికల్ కాలేజీలో ఫ్రేషేర్స్ డే వేడుకలు

ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): జీవితంలో మంచి జ్ఞాపకాలు ఇచ్చే పద్దతుల్లో విద్యార్థులు వైద్య విద్యను కొనసాగించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.శుక్రవారం సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన ఫ్రేషెర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.సీనియర్ విద్యార్థులు , జూనియర్లతో స్నేహ పూర్వకంగా మెలగాని సూచించారు.అవతలి వ్యక్తుల నుండి గౌరవాన్ని పొందేలా ప్రవర్తించాలని కోరారు.సూర్యాపేట మెడికల్ కాలేజ్ ను స్థాపించిన మూడు ఏళ్లలోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.దీనికి కారణమైన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ శారదా దేవి, సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి సేవలను కొనియాడారు.వైద్య సిబ్బంది, విద్యార్థులు , వైధ్యేతర సిబ్బంది కృషితో కరోనా కాలంలో వేలాది మంది రోగులు ప్రాణాలను నిలబెట్టుకున్నారన్నారు.భవిష్యత్ లోనూ ఇదే రకమైన సేవలు అందించి సూర్యాపేటకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.త్వరలోనే సొంత బిల్డింగ్ కు మారనున్న మెడికల్ కాలేజ్ విద్యార్దులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని విధాల సామాగ్రిని సమకూర్చామని చెప్పారు.ఈ సందర్బంగా వైద్య విద్యార్ధులు చేసిన సాంస్కతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.