కరోనా రూల్స్ పాటించకుంటే జీతం కట్
టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం
న్యూఢల్లీి,డిసెంబర్15 (జనంసాక్షి):- కరోనా రూల్స్ విషయంలో టెక్ దిగ్గజం కఠినంగా ఉండాలని నిర్ణయించింది. కంపెనీ కొవిడ్ వ్యాక్సినేషన్ పాలసీని పాటించని ఉద్యోగులపై వేటు తప్పదని ప్రకటించింది. అలాంటి ఎంª`ª`లాయీస్ జీతాల్లో కోతలు, అవసరమైతే ఉద్యోగం నుంచి తీసేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రీసెంట్ గా ఉద్యోగులకు గూగుల్ మెమో జారీ చేసినట్లు ఇంటర్నేషనల్ విూడియాలో వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 3లోగా వ్యాక్సినేషన్ స్టేటస్ ప్రకటించాలని, అందుకు
సంబంధించిన సర్టిఫికేట్ అప్ లోడ్ చేయాలని గూగుల్ ఆ మెమోలో పేర్కొంది. ఒకవేళ ఏదైనా కారణాలతో మినహాయింపు కావాలనుకుంటే దాని కోసం దరఖాస్తు చేసుకోవాలని గూగుల్ తెలిపినట్లు తెలుస్తోంది. నిర్ణీత తేదీలోపు వ్యాక్సినేషన్ స్టేటస్ అప్ లోడ్ చేయని ఉద్యోగులకు చివరి అవకాశంగా వచ్చే ఏడాది జనవరి 18 తేదీని టాª`గ్గంªట్ గా ఫిక్స్ చేసింది. అప్పటికీ రూల్స్ పాటించని ఉద్యోగులను 30 రోజుల శాలరీతో కూడిన సెలవులోకి పంపుతామని, ఆ తర్వాత ఆరు నెలల వరకు పర్సనల్ లీవ్స్ ఇచ్చి ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని గూగుల్ హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై గూగుల్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు.