కరోనా వేవ్‌లో పాసయిన వారిని గుర్తించం


ప్రభుత్వం పేరుత వైరల్‌గా మారిన పోస్ట్‌
అది బోగస్‌ అంటూ వివరణ ఇచ్చి ప్రభుత్వం
న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌, సెకండ్‌ వేవ్‌ కారణంగా ప్రభుత్వం పాఠశాలలను మూసివేసింది. దీంతో ఆన్‌లైన్‌ క్లాస్‌ల ద్వారా పాఠాలు బోధించింది. క్లాస్‌ల అనంతరం పరీక్షల నిర్వహణ కష్టతరం కావడంతో విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం పాస్‌ చేసింది. ఈ
నేపథ్యంలో ఇలా ప్రమోటైన 10,12 తరగతుల విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కారు అని ప్రధాని చిత్రంతో ఉన్న పోస్టు వైరల్‌గా మారింది. దీంతో విద్యార్థుల్లో ఆందోళనకు కారణమైంది. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. ఈ వార్త పూర్తిగా అసత్యం అని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని పీఐబీ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపింది. ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని అది పూర్తిగా అసత్య ప్రచారమని తెలిపింది. అలాంటి వార్తలు ఉన్న చిత్రాలు నకిలీవని వాటిని ఎవ్వరికీ షేర్‌ చేయొద్దని సూచించింది. టువంటి ముఖ్యమైన సమాచారం ప్రభుత్వం అధికారికంగానే వెలువరుస్తుందని.. ఇలా ప్రచారంలో ఉన్నవాటిని నమ్మవద్దని వాటిని ఎవ్వరూ పరిగణించరని తెలిపింది. ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశం లేదని అసత్య ప్రచారంతో ఆందోళన చెందవద్దని పీఐబీ సూచించింది.
ª`రభుత్వ పథకాలు, ప్రకటనలై వివిధ సోషల్‌ విూడియాలో వచ్చే తప్పుడు వార్తలను గుర్తించడానికి పీఐబీ డిసెంబర్‌, 2019లో ఫాక్ట్‌ చెక్‌ విభాగాన్ని ఏర్పటు చేసింది. కరోనా ద్వారా కేంద్ర ప్రభుత్వం పాఠశాలలను సెప్టెంబర్‌ 30 వరకు మూసివేసిందని వీటిని తెరిచే విషయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉందని తెలిపింది. పాఠశాలల ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అధికారిక సమాచారాన్నే నమ్మాలని కోరింది.

తాజావార్తలు