కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు పలికారు : బొత్స
హైదరాబాద్ : అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్‌కు కర్ణాటకలో ప్రజలు మద్దతు పలికారని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో తప్పు జరిగితే విపక్షాల విమర్శల కంటే ముందుగా సరిచేసుకుంటామని చెప్పారు.