కర్నాటకలో కాంగ్రెస్ ఢమాల్‌

ఐదేళ్లు కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఓటమి అంచున నిలబడింది. 80 నుంచి 90 సీట్లు కచ్చితంగా గెలిచి తీరతాం అనుకున్న కాంగ్రెస్.. ఓట్ల లెక్కింపులో మాత్రం డీలా పడింది. కేవలం 60 నుంచి 65 స్థానాల్లోనే గెలుపు దిశగా వెళుతుంది. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఎన్ని సర్వేలు చేసినా.. ఏ విధంగా చూసినా ఇన్ని తక్కువ సీట్లు రావటం ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్ పెద్దలు.హైదరాబాద్ కర్నాటక, కోస్టల్ కర్నాటక, మైసూర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుందని.. మెజార్టీ ట్లు ఇక్కడి నుంచే వస్తాయని అంచనా వేశారు. అందుకు భిన్నంగా ఫలితాలు ఉన్నారు. మైసూర్ ప్రాంతంలో కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించినా.. కోస్టల కర్నాకట, హైదరాబాద్ కర్నాటకలో కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూసింది. ఇక బళ్లారి రీజియన్ లోనూ గాలి బ్రదర్స్ దెబ్బకు కాంగ్రెస్ కొట్టుకుపోయింది. 2013 ఫలితాలతో పోల్చితే కాంగ్రెస్ 63 స్థానాలను కోల్పోగా.. బీజేపీ 81 సీట్లను అదనంగా గెలుచుకోవటం విశేషం.