కర్నాటక ముఖ్యమంత్రిగా జగదీష్ షెట్టర్
ఢిల్లీ: కర్నాటక రాజకీయం రోజుకో కొత్త రాజకీయ రంగులు పులుము కుంటూ అసమ్మతి సెగలు రాజేసుకుంటూ అధిష్టానానికి కంట్లో నలుసుల తయారయిన కర్నాటకీయం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు కన్పిస్తుంది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు నితిన్‌గడ్కారి అధ్యక్షత జరిగిన సమావేంలో ప్రస్తుతం కర్నాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సదానందగౌడను తొలగించాలని కోర్‌కమీటి నిర్ణయించింది. యాడ్యురప్ప వర్గం మద్దతున్న జగదీష్ షెట్టర్‌ను ముఖ్యమంత్రి చేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. యాడ్యురప్ప వర్గాన్ని శాంతింప చేయాలంటే అధిష్టానానికి ఉన్న మార్గం షెట్టారును ముఖ్యమంత్రిని చేయటమే అందువలన జగదీష్ షెట్టార్‌ను ముఖ్యమంత్రిని చేయాలని అధిష్టానం నిర్ణయించింది దీనితో యాడ్యురప్ప వర్గాన్ని సంతృప్తి పరచినట్లు ఉంటుందని అధినాయకత్వం ఈ మార్పును చేసింది.