కర్నూలు జిల్లాలో ఆర్టీఏ తనిఖీలు
కర్నూలు: ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టి నిబంధనలకు విరుద్థంగా తిరుగుతున్న 4 ప్రైవేటు బస్సులను జప్తు చేశారు. తిరుపతి, హైదరాబాద్, బెంగళూరులకు వీటిని అనుమతి లేకుండా తిప్పుతున్నారని తెలియజేశారు. అధిక లోడ్‌తో వెళ్తున్న 9 వాహనాలపై కేసు నమోదు చేశారు.