కలుషితాహారం తిని 150 మంది విద్యార్థినులకు అస్వస్థత

అనంతపురం: లుషితాహారం తిని 150 మంది విద్యార్థులు అస్వస్థతకు  గురైన ఘటన అనంతపురం జిల్లా నల్లమాడలో చోటు చేసుకుంది, నల్లమాడలోని కస్తూర్బా ఆశ్రమ  పాఠశాలలో ఆదివారం ఆహారం తీసుకున్న 150 మంది విద్యార్థినులు ఆస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.