కలెక్టరేట్ ఎదుట ఆరోగ్య మిత్రల ధర్నా
ఆదిలాబాద్ కలెక్టరేట్: ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న తమ డిమాండ్లు పరిష్కరించాలని జిల్లాలోని ఆరోగ్య మిత్రలు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్, అనిత, సీహెచ్, జయరాం మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెం.3 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి ఈఎన్‌ఐ, పీఎఫ్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు ఎం.శ్రీనివాస్, రాకేశ్, లక్ష్మణ్ , రమాదేవి తదితరులు పాల్గొన్నారు.