కలెక్టరేట్ ఎదుట బిడేకన్నె గ్రామరైతుల ధర్నా
సంగారెడ్డి మున్సిపాలిటీ పంట నష్టపరిహరంలో అవినీతి జరిగిందని అరోపిస్తూ ఝురా సంఘ మండలం బిడేకన్నె గ్రామ రైతులు అందోళన చేశారు. అనంతరం కలెక్టర్ దినకర బాబును కలసి అధారాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. స్పందించిన కలెక్టర్ ఝురాసంఘం మండల వ్యవసాయాధికారి శంకర్ బిడేకన్నెల వీఅర్వో అమృతరావులను సస్పెండ్ చేస్తున్న అదేశాలు జారీ చేశారు వ్యవసాయ శాఖ ఏడీకి షోకాజ్ వోటిసులు జారీ చేయాలని సూచించారు