కలెక్టరేట్‌ ముందు విఆర్‌ఎల ఆందోళన

నిజామాబాద్‌,మే2( జ‌నం సాక్షి): ఎపిపిఎస్సీ  ద్వారా 2012, 2014 ద్వారా డైరెక్ట్‌గా  నియమితులైన వి.ఆర్‌.ఏ లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ 6 నెలల లోపు క్రమబద్దీకరణ చేస్తానని ఇచ్చిన హావిూని వెంటనే నెరవేర్చాలని జిల్లా గ్రామ రెవెన్యూ  అసిస్టెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజ్‌ గణెళిశ్‌ దీపక్‌ అన్నారు. పరీక్షల ద్వారా డైరెక్ట్‌ నియమితులైన 3000 మంది వి.ఆర్‌.ఏ లకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 6 నెలల్లో క్రమబద్దీకరణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించి 15 నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోయిందన్నారు. అందుకు నిరసనగా బుధవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కలెక్టరుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ  వారి సమస్యలను పరిష్కరించని యెడల మే 4న సి.సి.యల్‌.ఏ కార్యాలయం, 7న హైదరాబాద్‌ సచివాలయం ముందు, 9 న ప్రగతి భవన్‌ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే 14వ తేదీ నుండి ఆమరణ నిరాహారదీక్ష మొదలు పెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్యామ్‌ గౌడ్‌, కాళిదాస్‌, దర్శన్‌, పూర్ణ, రూప, అనూష, విక్రమ్‌, సరిత తదితరులు పాల్గొన్నారు…