కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
శుభ శుక్రవారం సందర్భంగా రామన్నపేట మండలం సరినేని గూడెం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శుక్రవారం సభకు హాజరై పలు సూచనలు చేశారు. గర్భిణీ మహిళలు పౌష్టిక ఆహారం తో పాటు వ్యాయామం , యోగ లాంటి వాటిని చేస్తు సమయానీ వైద్యులు అందజేసిన మందులు వినియోగిస్తూ ఉండాలని ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలు ఎక్కువగా నార్మల్ డెలివరీ లకే ప్రాముఖ్యత ఇవ్వాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంగన్ వాడి కేంద్రంలోని 3 మంది పిల్లలకు అన్న ప్రాసన్న , 2 మందికి అక్షర బ్యాసం నిర్వహించారు. అంగాన్ వాడి కేంద్రం, పరిసరాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ గ్రామంలో నిర్వహించ బడుతున్న పల్లె ప్రకృతి వనాని పరిశీలించి జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ , జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, స్పెషల్ ఆఫీసర్ , డి ఆర్ డి ఓ నాగి రెడ్డి, ఎంపీడీఓ జలంధర్ రెడ్డి, ఏమార్వో ఆంజనేయులు, సీడీపీఓ , శైలజ, గ్రామ సర్పంచ్ .ధరణి రాణి, , ఉప సర్పంచ్ యం.శోభన్ బాబు. తదితరులు పాల్గొన్నారు.